TEJA NEWS

శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

తిరుపతి నగరంలో శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలని, కాలువలు నిరంతరం శుభ్రపర్చడం, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించడం చేస్తూ వుండాలని మునిసిపల్ కార్పొరేషన్ పారిశుధ్య, ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసారు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్. తిరుపతి నగరంలోని స్కావేంజర్స్ కాలనీ, కొత్తూరు, శివజ్యోతి నగర్, అయ్యప్ప కాలనీ ప్రాంతాల్లో ఉదయం కమిషనర్ పరిశీలించారు. ముఖ్యంగా డయేరియా, మలేరియా, డెంగీ ప్రభలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాలువలు, రహదారులు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వవుండ కుండా చూడాలని, క్లోరినేషన్ ప్రకియను నిత్యం నిర్వహించాలని, దోమలు వ్యాపించకుండా మందులు స్ప్రే చేయించాలని, బ్లీచింగ్ చల్లించే ప్రకియ నిరంతం చేపట్టాలని ఈ సందర్భంగా హెల్త్, శానిటేషన్, ఇంజనీరింగ్ అధికారులకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, సంజీవ్ కుమార్, శానిటరి సూపర్ వైజర్లు చెంచెయ్య, సుమతి పాల్గొన్నారు.

శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

TEJA NEWS