TEJA NEWS

శంకర్‌పల్లి: మంచినీటి సహాయకుల శిక్షణ సర్టిఫికెట్లను ప్రధానం చేసిన ఎమ్మెల్యే

శంకర్పల్లి : మనిషి మనుగడకు నీరే జీవనాధారం అని చేవెళ్ల MLA యాదయ్య అన్నారు. శంకర్‌పల్లి మండల కేంద్రంలో మంచినీటి సహాయకుల శిక్షణ ముగింపు సందర్భంగా MLA హాజరై వారికి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. MLA మాట్లాడుతూ మంచినీటి సహాయకులకు శిక్షణ ఇవ్వడం మంచి పరిమాణం అని, శిక్షణ తీసుకున్న వారు కష్టపడి పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య గౌడ్, DE RWS హారిక, AE RWS వెంకటేశ్వరరావు, JE RWS పాల్గొన్నారు.


TEJA NEWS