TEJA NEWS

పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

గొల్లపూడి సచివాలయం-1 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష-2 క్యాంపు నిర్వహణ.

శిబిరాన్ని సందర్శించి రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 2.1.2024.

ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని మరింత చేరువ చేసేందుకు శ్రీకారం చుట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో మంగళవారం ప్రారంభమైంది.

విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి సచివాలయం-1 పరిధిలో మంగళవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యసేవలు పొందుతున్న రోగులను పరామర్శించారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ

గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి ముంగిటిలోనే పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ చికిత్సల వ్యయం పరిమితిని సీఎం జగనన్న రూ.25 లక్షలకు పెంచారని అన్నారు.

రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైన సందర్భాలలో నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్ఓలు, ఎఎన్ఎంలు తీసుకుంటారని అన్నారు. చికిత్సానంతరం పేషెంట్లకు అవసరమైన కన్సల్టేషన్ సేవలతో పాటు అవసరమైన మందుల్ని కూడా వారికి అందజేస్తారన్నారు.

వైద్య ఆరోగ్య సేవల్ని అందించే విషయంలో ఏ ఒక్క గ్రామాన్నీ వదిలి పెట్టరాదన్న లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేషెంట్లందరినీ ఆరోగ్య శిబిరాలనుండి సిహెచ్వోలు, ఏఎన్ఎంలు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులలోని ఆరోగ్యమిత్రల ద్వారా నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు.

రెండోదశ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లల్లో ఉన్న దీర్ఘకాలిక రోగులు, గర్భవతులు, బాలింతలతో పాటు ప్రసవానంతర శిశు సంరక్షణ సేవలు, అన్ని వయస్సుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవల్ని అందించనున్నారని పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS