TEJA NEWS

ఏలూరు : ‘స్టాప్ డయేరియా కాంపెయిన్’ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి . సందర్బంగా మాట్లాడుతూ డయేరియా వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చెయ్యాలని సూచించారు. ‘స్టాప్ డయేరియా కాంపెయిన్’ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను, ప్రజలను భాగస్వామ్యం చెయ్యాలని అధికారులకు సూచించారు. పట్టణాలలో, గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందించాలని అధికారులకు ఆదేశాలు జారిచేసారు. జిల్లాలో జరుగుతున్నా యస్.డి.సి కార్యక్రమాల వివరాలు డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్, జిల్లా వైద్యశాఖ అధికారి శర్మిష్టని అడిగి తెలుసుకున్నారు. సందర్బంగా అంగన్వాడీ చిన్నారులతో ముచ్చడించారు అనంతరం మహిళలకు ఓ.ఆర్.ఎస్ పాకెట్స్, జింక్ సాచేట్స్ పంపిణి చేసారు. జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి , డిఆర్ఓ పుష్పమణి తదితరులు పాల్గున్నారు


TEJA NEWS