మైనార్టీల సంక్షేమ కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతునివ్వండి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ….
129 – సూరారం డివిజన్ కళావతి నగర్ మహమ్మదీయ మజీద్ గల్లీలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ప్రజలను కలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం నిత్యం పాటుపడే పార్టీ బిఆర్ఎస్ అన్నారు. గత పదేళ్ల కాలంలో మైనారిటీల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం అనునిత్యం తపించే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం తనకు మద్దతు నివ్వాలని మత పెద్దలను కలిసి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మైనారిటీ నాయకులు షేక్ మొహమ్మద్, అమీర్ ఖాన్, 129 డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎండి. మొయిజుద్దీన్, జనరల్ సెక్రటరీ సిద్ధిక్, సీనియర్ నాయకులు ఫెరోజ్, డాక్టర్ హుస్సేన్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.