వైసీపీ యూత్ అధ్యక్షునిగా వడ్డే సురేంద్రనాథ్ చౌదరి

వైసీపీ యూత్ అధ్యక్షునిగా వడ్డే సురేంద్రనాథ్ చౌదరి

TEJA NEWS

వైసీపీ యూత్ అధ్యక్షునిగా వడ్డే సురేంద్రనాథ్ చౌదరి.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, 31.12.2023.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మైలవరం మండల శాఖ అధ్యక్షునిగా మర్సుమల్లి గ్రామానికి చెందిన వడ్డే సురేంద్రనాథ్ చౌదరి (నాని) ఇటీవల నూతనంగా నియమితులయ్యారు.

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని వడ్డే సురేంద్రనాథ్ చౌదరి ఆదివారం ఐతవరం గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ పదవిని అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు నానికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS