గుడివాడ రూరల్ మండలంలో విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 36వ రోజు ఎన్నికల ప్రచారం

Spread the love

ఉదయం రామనపూడి, చిరిచింతల, నూజెల్ల గ్రామాలు….సాయంత్రం చిన్న ఎరుకపాడు, బిళ్లపాడు గ్రామాల్లో జన నిరాజనాల మధ్య ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన ఎమ్మెల్యే నాని

-మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గుడివాడలో తనకు, రాష్ట్రంలో జగన్‌కు ప్రజలు మద్దతుగా నిలవాలి….

-పేదలకు మంచి జరగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి…

-సంక్షేమ పాలనతో మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న రుణాన్ని 13 తేదీన జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసి తీర్చుకోవాలి….

-సీఎం జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారన్నారు….

గుడివాడ రూరల్02:ఎమ్మెల్యే కొడాలి నాని 36 వ రోజు ఎన్నికల ప్రచారం జననీరాజనాల మధ్య విజయవంతంగా ముగిసింది. గుడివాడ రూరల్ మండలంలో రామనపూడి, చిరిచింతల, నూజెల్ల గ్రామాల్లో ఉదయం ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని….సాయంత్రం చిన్న ఎరుకపాడు, బిళ్లపాడు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ గ్రామాన వైఎస్ఆర్సిపి శ్రేణులు…. గ్రామస్థులు ఎమ్మెల్యే నానీకు ఘన స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో వందలాది మంది తరలివచ్చి ఎమ్మెల్యే కొడాలి నానిను తమ గ్రామాల్లో పూల వర్షంతో నడిపించారు. మీ ఊరికి మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి.. మా పాలనలో మార్పు కనపడితే మద్దతు ఇవ్వండని ప్రజానీకానికి ఎమ్మెల్యే నాని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పై నొక్కాలంటూ ప్రజానీకాన్ని అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే కొడాలి నాని తన ప్రచారాన్ని కొనసాగించారు. గ్రామ గ్రామాన వైఎస్ఆర్సిపి శ్రేణులు….. అభిమానులు వివిధ రూపాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలని ఆయన కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గుడివాడలో తనకు, రాష్ట్రంలో జగన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.. పేదలకు మంచి జరగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. జగనన్న హయాంలోనే గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే పూర్తి చేస్తామని కొడాలి నాని తెలియజేశారు సంక్షేమ పాలనతో మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న రుణాన్ని 13 తేదీన జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసి తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. కల్లబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలనుకుంటున్న వారిని ప్రజలు ఓడించాలని ఎమ్మెల్యే కొడాలి నాని కోరారు.సీఎం జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారన్నారు. బీజేపీతో తాను కలిశానంటే ఐదు కోట్ల ప్రజల శ్రేయస్సు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసమేనని చంద్రబాబు చెప్పడంపై కొడాలి నాని కౌంటర్ వేశారు. మొన్నటి వరకు ముగ్గురు ఫోటోలతో ప్రచారం చేసిన చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసే సమయానికి కేవలం పవన్, చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కూటమి నేతలు మేనిఫెస్టో పేరుతో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

ఎన్నికల ప్రచారంలో కృష్ణాజిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, గుడివాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ మట్ట నాగమణి జాన్ విక్టర్, జడ్పిటిసి గొళ్ల రామకృష్ణ, ఎంపీపీ గద్దె పుష్పరాణి, వైస్ ఎంపీపీ బట్టు నాగమల్లేశ్వరి, ఎంపీటీసీలు చుక్కా నాగలక్ష్మి, గుంజ వంశీధర్, సింగవరపు ఝాన్సీ రాణి, గుడివాడ మండల సచివాలయాల కన్వీనర్ కారే జోసెఫ్, సర్పంచులు మేగడ మురళీధర్, తోట వీరరామయ్య, పఠాన్ గోస్లా, మేడేపల్లి ప్రభాకర్ రావు, ఇస్సా కృష్ణమూర్తి, వెలగలేటి రమ్య, గుడివాడ నియోజకవర్గం లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పిటిసి చిన్ని దుర్గాప్రసాద్, జోగి సాములు, బుజ్జి, మీగడ రామరాజు, మీగడ కృష్ణ, ఉపద్రృష్ట రాంబాబు, వట్టెం చిట్టిబాబు, చుక్క నాగరాజు, మెండ కిరణ్, నిమ్మగడ్డ నాగాంజనేయులు, బొడ్డు గ్రేస్ సుందరం, జుజ్జువరపు సోనీ, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు తోట వెంకాయమ్మ, Amc డైరెక్ట్ చందనపల్లి సుందర రావు, మాజీ సర్పంచ్ సింగవరపు సుబ్బారావు, బూత్ కమిటీ ఇంచార్జి బుడిమెల్లి వినోద్, పిల్లి బెనర్జీ, సురపనేని కళ్యాణ్, డొక్కు రాంబాబు, మేకల సత్యనారాయణ, ఏలేటి ఆగస్టు, లోయ రాజేష్, గుడివాడ ప్రభాకర్,గిరి బాబాయ్, తోట రాజేష్, ఘంటా సురేష్, నల్లమోతు జగదీష్, చుండూరి శేఖర్, గుడ్లవల్లేరు మండల యువజన విభాగ అధ్యక్షుడు గుదే రవి, చుండి బావి, పుల్లేటికుర్తి కృష్ణ, నీరుడు ప్రసాద్, క్రేన్ బాబి, అబ్దుల్ రజాక్, కర్రే నాని, కర్రే చిన్ని, చింతాడి నాగూర్, ఘంటా శ్రీను,నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, , గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page