TEJA NEWS

AP CM YS Jagan : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్‌ బయలుదేరారు. బస్సు ప్రయాణం ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయనపల్లి, యరగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. బస్సుయాత్ర ప్రారంభించిన జగన్‌కు ప్రజలు స్వాగతం పలికారు. మార్గమధ్యంలో జగన్ బస్సు దిగి ప్రజలకు అభివాదం చేశారు. ఆయన వారి అభ్యర్థనను అంగీకరించారు.

బస్‌యాత్ర నుంచి బయలుదేరే ముందు ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సీఎం జగన్‌ సందర్శించారు. మరియు ఆయన సమాధికి నివాళులర్పించారు. అక్కడ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ విజయమ్మతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు, పూజారులు సీఎం జగన్‌ను ఆశీర్వదించారు.


TEJA NEWS