కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డిజిపి ఊమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యం లో ఆసిఫాబాద్ పట్టణం లో భరోసా సెంటర్ ను జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్, ఐపీఎస్ ప్రారంభించారు..
జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ మాట్లాడుతూ…..
మహిళల భద్రతకు భరోసనిస్తూ, బాధిత మహిళలను, పిల్లలను హక్కున చేర్చుకొని, కొండంత ధైర్యాన్నిస్తూ, మహిళలు , పిల్లల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందని, జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపీఎస్ అన్నారు.
భరోసా సెంటర్ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో, అత్యాచార కేసులలో కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు CWC (Child Welfare Committe ) ద్వారా భాదిత మహిళలకు షెల్టర్ కల్పించడం జరుగుతుందన్నారు. పోలీసు స్టేషన్ లో కేసు నమోదు మొదలుకొని, చివరివరకు అన్ని తానై వెన్నంటి ఉంటూ, బాధిత మహిళలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ చట్టాలన్నీ పోక్సో చట్టం మరియు పిల్లల చట్టాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.బాధితులకు భరోసా సెంటర్ అండగా ఉంటుందని వేదింపులు, అత్యాచారం, బాధిత మహిళలకు, పిల్లలకు ఒకే చోట మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజికల్ సమస్యలను ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ రాష్ట్ర పోలీసు ఊమెన్ అండ్ చెల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగినది అని అన్నారు. మహిళలు మరియు పిల్లల పై జరిగే నేరాలను ,హింసను తగ్గించడమే ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం అని కావున మహిళలు, యువతులు, బాలికలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, టాస్క్ ఫోర్స్ మరియు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ రమేష్, ఆసిఫాబాద్ సిఐ సతీష్, ఎస్ఐ రాజ్యలక్ష్మి, ఆర్.ఎస్.ఐ రాజేష్, ఆసిఫాబాద్ షి టీమ్ ఇంఛార్జి సునీత, కాగజ్ నగర్ షి టీమ్ ఇంఛార్జి శ్రీనివాస్, భరోసా సెంటర్ సిబ్బంది, షి టీమ్ సభ్యులు, మహిళ కానిస్టేబుల్స్ , తదితరులు పాల్గొన్నారు.