TEJA NEWS

అడ్డంగా దోచేసిన డబ్బును వెదజల్లినా ఓటమి నుంచి తప్పించుకోలేడు

ఎన్టీఏ అధికారంలోకి రావడం ఖాయం. సర్వేపల్లికి పూర్వవైభవం తథ్యం

దయచేసి కాకాణి పంచుతున్న మందు ఎవరూ తాగొద్దు..తాగి ప్రాణాల పైకి తెచ్చుకోవద్దు

2014 తరహాలోనే సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రమాదకరమైన మద్యాన్ని దింపేశాడు

మొన్న పంటపాళెం. ఈ రోజు విరువూరులో కాకాణి మద్యం డంప్ లు బయటపడ్డాయి

ఇంకా ఊరూరా ప్రమాదకరమైన మద్యాన్ని భారీగా స్టాక్ చేసివున్నాడు. తస్మాత్ జాగ్రత్త

వెంకటాచలంలో నామినేషన్ దాఖలు అనంతరం మీడియాతో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఉదయం 11.18 గంటలకు సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను

ఒక్క పిలుపు కూడా లేకుండా వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజానీకానికి ధన్యవాదములు

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమైపోయింది

ప్రజల ఆశీస్సులతో సర్వేపల్లి ఎమ్మెల్యేగా నేను, తిరుపతి ఎంపీగా వెలగపల్లి వరప్రసాద్ గెలవబోతున్నాం

విశ్రాంత ఐఏఎస్ అధికారిగా, ఎంపీ, ఎమ్మెల్యేగా అనుభవజ్ఞుడైన వరప్రసాద్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చే శక్తి ఉంది.

నేను రాష్ట్రంలో, ఆయన కేంద్రంలో కష్టపడి పనిచేసి సర్వేపల్లి నియోకవర్గాన్ని ప్రగతి బాటపట్టిస్తాం. పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

జగన్ మోహన్ రెడ్డి రేపోమాపో విడుదల చేసే మేనిఫెస్టోలో మళ్లీ 100 హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

2024 నాటికి మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళలను ఓట్లు అడగతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు

45 ఏళ్లకే పింఛన్ అన్నాడు, విద్యుత్ చార్జీలను తగ్గించేస్తానన్నాడు.

మండలానికి ఓ వృద్ధాశ్రమం పెడతానన్నాడు. నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తానన్నాడు

2019 ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ బోగస్. ఒక్కటి కూడా అమలు చేయలేదు

99 శాతం హామీలు అమలు చేశామని జగన్మోహన్ రెడ్డి గొప్పలకు పోతున్నాడు. కానీ 99 హామీలు అమలుకు నోచుకోలేదనేందుకు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి

రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా, అరాచకానికి కేరాఫ్ గా మార్చేసిన వైసీపీకి ఓట్లు అడిగే హక్కే లేదు

జగన్మోహన్ రెడ్డి చేతిలో సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని మళ్లీ బాగుచేసుకునేందుకు స్థిరమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు

రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడు నాయకత్వం, కేంద్రం సహకారం అవసరమని టీడీపీ – బీజేపీ – జనసేనను కలిపి సినిమాల్లోనే కాక ప్రజాజీవితంలోనూ రియల్ హీరో అని పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు.

మూడు పార్టీల కూటమితోనే రాష్ట్రానికి ప్రజలు వస్తాయని ప్రజలందరూ నమ్ముతున్నారు. మమ్మల్ని ఆశీర్వదించేందుకు సిద్ధమయ్యారు

సర్వేపల్లి నియోజకవర్గాన్ని వైసీపీ ఐదేళ్లపాలనలో అవినీతి, అరాచకాలు, అక్రమ కేసులు, అమాయకులను జైళ్లకు పంపండం, అక్రమ మైనింగ్, భూకుంభకోణాలకు నిలయంగా మార్చారు.

నా జీవితంలో ఎప్పుడూ నా మీద కేసులు లేవు. తొలిసారిగా ఇప్పుడు నామినేషన్ లో 18 కేసులు చూపించే పరిస్థితి తెచ్చారు.

అవినీతి, అరాచకాలు, దోపిడీతో విసిగివేసారిపోయిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రతిఘటన సినిమా చూపించబోతున్నారు

ఊళ్లకు ఊళ్లుగా వైసీపీ ఖాళీ అయిపోతుండటంతో కాకాణి తట్టుకోలేని పరిస్థితికి వచ్చేశాడు

అడ్డంగా దోచేసిన డబ్బును వెదజల్లినా కాకాణి ఓటమిని తప్పించుకోలేడు

అమాయకులను బలితీసుకునేందుకు మరోసారి ప్రమాదకరమైన కల్తీ మద్యాన్ని ఊళ్లలో దింపేశాడు

కాకాణి గోవర్ధన్ రెడ్డి రియల్ ఎస్టేట్ కంపెనీలో భాగస్వామి అయిన ముత్తుకూరు మండల వైసీపీ కీలక నేత మారు సుధాకర్ రెడ్డి ఇంట్లోనే మద్యం డంప్ బయటపడింది. ఈ రోజు సుధాకర్ రెడ్డి జైల్లో ఉన్నాడు

2014 ఎన్నికల సమయంలోనూ ఇదే మాదిరిగా కల్తీ మద్యం తెచ్చి ఏడుగురు అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాడు. ఎందరో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు

అప్పుడు కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ తెచ్చుకుని అందరినీ జైలుకు పంపించాడు. ఇంటర్నేషనల్ స్ల్మగ్లర్ అప్పూ అదే కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ చనిపోయాడు

ఇప్పుడు మళ్లీ ఆయన మాత్రం కరోనా ప్యాలెస్ లో సేఫ్ గా కూర్చుని ఒక్కొక్క నాయకుడిని మద్యం కేసుల్లో జైలుకు పంపుతున్నాడు

నెల రోజుల క్రితం 1.40 లక్షలకు పైగా మద్యం సీసాలను సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కాకాణి డంప్ చేశాడు

సర్వేపల్లి నియోజకవర్గంలో మద్యం అలవాటు ఉన్న వారికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే

దయచేసి కాకాణి గోవర్ధన్ రెడ్డి మనుషులు పంచే మందు తాగొద్దు. తాగి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు


TEJA NEWS