TEJA NEWS

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ గ్రీన్ కోర్టు అపార్ట్మెంట్ వాసుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు పర్యటించడం జరిగినది అని , గ్రీన్ కోర్టు అపార్ట్మెంట్ వద్ద నెలకొన్న డ్రైనేజి సమస్యను పరిష్కరించడానికి బకెట్ క్లినింగ్ చేపట్టాలని, మ్యాన్ హోల్ నుండి ప్రతి మ్యాన్ హోల్ వరకు బకెట్ క్లినింగ్ ద్వారా మ్యాన్ హోల్ లో పేరుకుపోయిన పూడికను తీయాలని, అదేవిధంగా డ్రైనేజి నీరు ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ప్రతి మ్యాన్ హోల్ వద్ద పూడిక తీత తీయాలని, మ్యాన్ హోల్ లో పేరుకుపోయిన చెత్త చెదారం ను తీసి వేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఎక్కడ డ్రైనేజి సమస్యాత్మక ప్రాంతంగా నిత్యం పొంగే ప్రదేశాలలో, కాలనీ లలో ప్రథమ ప్రాధాన్యత గా పాత లైన్లు మార్చి కొత్త లైన్లను కలపాలని బకెట్ క్లినింగ్ పెట్టి సమస్యను పరిష్కరించాలని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని జలమండలి అధికారులకు తెలియచేయడం జరిగినది అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు పేర్కొన్నారు. అదేవిధంగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా నా దృష్టికి గాని కార్పొరేటర్ కార్యాలయం దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో అధికారులు డీజీఎం నాగప్రియ, మేనేజర్ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్ మరియు అపార్ట్మెంట్ వాసులు చంద్రం, గంగాధర్, వేణు వర్ధన్ రెడ్డి, తిరుమలేష్, ఫణి ప్రసాద్, దయాకర్, సూర్య నారాయణ, సంతోష్, నాయకులు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS