TEJA NEWS

ఇది గతంలో ఎన్నడూ లేని, చూడని జలప్రళయం.విమర్శలకు తావులేదు…ఒకరికొకరు సాయపడుదాం.

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్.ఇబ్రహీంపట్నంలో వరద బాధితులకు పరామర్శ.

జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీకి హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం అందజేత.ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ…వరుసగా నాలుగో రోజు పర్యటన.బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం

‘ఇది గతంలో ఎన్నడూ లేని, చూడని జలప్రళయం. అన్ని విపత్తులూ ఒక్కసారే వచ్చాయి. బుడమేరు, మున్నేరు, కట్టలేరు, కృష్ణానదికి ఎగువ ప్రాజెక్టుల నీరు ఒకే సారి వచ్చాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద గరిష్టంగా 11.47 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారంటే వరద ఉధృతి ఏ విధంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతోంది.

మైలవరం నియోజకవర్గంలో వరదలు ముప్పేట దాడి చేశాయి. అన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం. మీ ఇబ్బందులన్నీ స్వయంగా చూస్తున్నాను. మీ పరిస్థితి చూసి నాకు బాధ వేస్తోంది. అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలిరండి. మిమ్మల్ని రక్షించే వరకు నేను మీతోనే ఉంటా.

మీకు సకాలంలో ఆహారం, తాగునీరు అందించడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా. ఇది విమర్శలకు సమయం కాదు. ఒకరికి ఒకరు సాయపడాలి. ఎప్పటికప్పుడు .సీఎం చంద్రబాబునాయుడు , మంత్రి .నారా లోకేష్ గారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.’ అని మైలవరం శాసనసభ్యులు . వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

ఇబ్రహీంపట్నంలో వరద బాధితులకు ఆహారం, తాగునీటిని పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున ఆహార సరఫరా జరుగుతోందన్నారు. దీనికి తోడు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహారం, తాగునీరు ఇస్తున్నాయన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మీడియాతో మాట్లాడుతూ

శ్రీశైలం నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల నీరు, నాగార్జున సాగర్ దాటిన తర్వాత పులిచింతలకు, ప్రకాశం బ్యారేజీకి మరో 6 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిందన్నారు. భారీ వర్షపాతం నమోదు కారణంగా అకస్మాత్తుగా వరద భీభత్సం పెరిగిందన్నారు. ప్రమాద హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ కూడా ఊహించనంత వరద వచ్చిందన్నారు. ఇక్కడ పంపిణీ చేసేందుకు 30 వేల ఆహార ప్యాకెట్లు సిద్ధం చేసి ఇప్పటికే 10 వేల ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పారిశుధ్య చర్యల నిమిత్తం బ్లీచింగ్ పౌడర్ కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు పంపిణీ చేస్తామన్నారు. కొండపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లను అందజేతను ప్రారంభించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


TEJA NEWS