TEJA NEWS

రావినారాయణ చరిత్రను నేటి తరం తెలుసుకోవాలి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావినారాయణ రెడ్డి 34 వ వర్ధంతి కార్యక్రమాన్ని నేడు జగతగిరిగుట్ట కార్యాలయం వద్ద వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ అథితులుగా పాల్గొని మాట్లాడుతూ నాడు నిజాం రాజు భారతదేశంలో విలీనం చెయ్యకుండా స్వతంత్ర దేశంగా ఉంటానని చెప్పి సొంత సైన్యాన్ని రాజకర్ ను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా కాశిం రాజ్వి, ఉపాధ్యక్షుడిగా విసునూర్ రామచంద్రారెడ్డి ని నియమించి పేద ప్రజలను హింసిస్తుంటే ఈ బానిసత్వాన్ని రూపుమపడనికి ఆంధ్ర మహాసభ,కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రైతాంగ పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చి సాయుధ పోరాటం నిర్వహించాలని సంతకం చేసిన వారిలో రావినారాయణ ఒకరని తెలిపారు. తాను భూస్వామి కుటుంబానికి చెందినప్పటికి కమ్యూనిజం స్పూర్తితో తనకు చెందిన వందల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి పెట్టిన మహానుబావుడని అన్నారు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ ఓట్లు సాధించి పార్లమెంట్ భవనాని ప్రారంభించిన చరిత వారికే ఉందన్నారు. నేడు మెజార్టీ తగ్గిన,ఎంతో గణపోరాట చరిత్ర గల వారు ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టి,చివరికి దేశ ప్రధమ పౌరురాలు రాష్ట్రపతి ని కూడా పక్కనపెట్టి మోడీ ప్రారంభించడం వ్యక్తి పూజ అవుతుందని కావున ప్రజలు రావినారాయణ రెడ్డి లాంటి నిస్వార్థ నాయకుల జీవితాలను తెలుసుకొని,వ్యక్తి అహంతో,పెట్టుబడిదారులకు లాభాలు వచ్చేలా నిర్ణయాలను తీసుకుంటూ,వారి పార్టీకి వెల కోట్ల రూపాయలను చందా రూపంలో తీసుకొని ఎన్నికల్లో ప్రజలకు డబ్బులు పంచి గెలిచే వారి చరిత్ర తెలుసుకొవాలని కోరారు.
ఈ కార్యక్రమానికి శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి,కార్యవర్గ సభ్యులు హరనాథ్,మునిసిపల్ అధ్యక్షుడు రాములు,ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు,సీపీఐ నాయకులు రాజు,ఇమామ్, చారి,జానకిరామ్,కరుణాకర్,నగేష్ చారి,బాబు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS