TEJA NEWS

మచిలీపట్నం

కొల్లు రవీంద్ర,బాలశౌరి నామినేషన్ మాస్ జాతర తలపించిన నామినేషన్ ర్యాలీ.

కిలోమీటర్ల మేర జనసంద్రంతో కిక్కిరిసిపోయిన మచిలీపట్నం రోడ్లు

క‌దిలొచ్చిన మ‌హిళ లోకం…

కొల్లు రవీంద్ర వల్లభనేని బాలశౌరి నామినేషన్ ర్యాలీలో పోటెత్తిన బందరు ప్రజానీకం

విజయోత్సవాన్ని తలపించిన కొల్లు రవీంద్ర వల్లభనేని బాలశౌరి నామినేషన్ ర్యాలీ

బందరు చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఉమ్మడి అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమం

కూట‌మి అభ్యర్థుల విజయాన్ని బలపరుస్తూ పాల్గొన్న అశేష జనవాహినికి అభివాదం చేస్తూ సాగిన నామినేషన్ ర్యాలీ

నామినేష‌న్ హైలెట్స్

స్వగృహంలో స్వర్గీయ నడకుదుటి నరసింహారావు గారు, స్వర్గీయ కొల్లు సుబ్బారావు గారి చిత్రపటాలకు నమస్కరించి కుటుంబ సభ్యులతో కలసి ఇంటి వద్ద నిర్వహించిన సర్వ మత ప్రార్థనల్లో పాల్గొని.. నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు*.

ఇనుకుదురుపేట నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి అటు నుండి పాండురంగస్వామి గుడి, ఉలింగి పాలెం వినాయకుడు గుడిలోనూ, దొంతులమ్మ గుడిలోనూ, ఇనుకుదురుపేట నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి అటు నుండి పాండురంగ స్వామి గుడిలో పూజలు, అటు తరువాత సుల్తానగరం అభయాంజనేయ స్వామి దేవాలయంలో కొల్లు రవీంద్ర బాలసౌరి కొనకళ్ళ నారాయణ బండి రామకృష్ణాలు ప్రత్యేక పూజలు నిర్వహించి
మంగ‌ళ‌హారతిలిచ్చి విజ‌య తిల‌కం దిద్ది – ఆలింగనం చేసుకొని అభినందనలు తెలిపిన పార్టీ మరియు ఆత్మీయులు.

కుల‌మ‌తాల‌కు అతీతంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జల రాకతో – బందరు వీధుల్లో పండుగ వాతావరణాన్ని తలపించిన నామినేషన్ కార్యక్రమం.

ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేద వ్యాస్ మరియు ఎన్ డి ఏ కూటమి నేతలతో కలిసి ప్రచార వాహనంపై అభివాదం చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

ర్యాలీలో ఆకట్టుకున్న నృత్యాలు, సాంప్రదాయ వాయిద్యాలు, మేళ తాళాలు, గరగర నృత్యాలు.

అత్యాదునిక ఎల్లో స్నో, పసుపు పేపర్ల యంత్రాల ప్రదర్శనతో పసుపు మయంగా మారిన బందరు రోడ్లు.

ఎన్డీయే కూట‌మి కార్య‌క‌ర్త‌లు, ప్రజలు, అభిమానుల‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు
ర్యాలీలో కోనేరు సెంటర్ దారి పొడవున పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు, వివిధ వర్గాల ప్రజానీకం వివిధ రూపాల్లో అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.

ఉదయం 11 గంటల ముహూర్తానికి కొల్లు రవీంద్ర తరఫున సతీమణి కొల్లు నీలిమ ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు.

రెండవ సెట్టు జనసేన ఇన్చార్జి బండి రామకృష్ణ దాఖలు చేశారు, మూడవ సెట్టు మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు దాఖలు చేశారు.


TEJA NEWS