TEJA NEWS

లయన్స్ క్లబ్ ఆఫ్ వెల్గటూర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం..

ధర్మపురి ప్రతినిధి
లయన్స్ క్లబ్ ఆఫ్ వెల్గటూర్ ఆధ్వర్యంలో “జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం” సందర్భంగా స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యాకేంద్రంలో బెస్ట్ టీచర్ గ్రహీత గోనె సత్యం ని, ప్రధాన ఉపాధ్యాయులు బందెల అనిల్ కుమార్ ని,గుండ నవీన్‌ ని, విరబత్తిని శ్రీనివాస్ ని, ఉపద్యురాలు ముత్యం శ్రీలత ని, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది
ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ……
పరిచయం అక్కరలేని గొప్ప విద్యావేత్త, పండితుడు, తత్వవేత్త, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతిగా, ‘భారతరత్న’ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తని గ్రామంలో జన్మించారు. రాధాకృష్ణన్ రాష్ట్రపతి పదవికి ముందు దేశంలోని ప్రముఖ పత్రికలకు వ్యాసాలు రాయడంతో పాటు కలకత్తా విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారని తెలిపారు. అతని పూర్వ విద్యార్థులు, స్నేహితులు ఒకరోజు రాధాకృష్ణన్ రాష్ట్రపతి పదవిలో ఉండగా తన పుట్టినరోజు జరుపుతామని కోరగా అందుకు ఆయన నా పుట్టినరోజును ఆడంబరంగా జరపడానికి బదులు పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలలోని విద్యార్థులకు విద్యను నేర్పడంలో అవిరళముగా కృషిచేస్తున్న దేశంలోని ఉపాధ్యాయులందరికీ గౌరవ సూచకంగా తన పుట్టినరోజును జరుపుకోవాలని సూచించగా భారత ప్రభుత్వం 1962 సెప్టెంబర్ 5 నుండి ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవంను గురు శిష్యుల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజానికి లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ, సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సిరిపురం తిరుపతి , ట్రెజరర్ గదాసురాజేందర్ , లయన్ మంచాల ఓదెలు , ఉపాధ్యాయులు వెద్యార్థులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS