TEJA NEWS

బిజెపి సభ్యత్వానికి గ్రామాల్లో అపూర్వ స్పందన
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాజయం తప్పదు *
బిజెపి జిల్లా అధ్యక్షులు డి. నారాయణ జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు
వనపర్తి :
వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో మండల ఉపాధ్యక్షుడు కే.శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షులు డి. నారాయణ ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు డి.నారాయణ మాట్లాడుతూ దేశంలో ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా కార్యకర్తల నిర్మాణం కలిగిన భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం గల పార్టీగా చరిత్ర సృష్టించిందని 2024 లో జరుగుతున్న సభ్యత్వ నమోదులో కూడా కన్వీనర్లు ప్రతి పోలింగ్ బూత్ లో 250 సభ్యత్వాలు చేయించాలని అందులో మహిళలు,రైతులు యువకులు అన్ని వర్గాల ప్రజలు తప్పనిసరిగా సభ్యత్వం కలిగి ఉండేలా ప్రణాళికల రూపొందించుకొని మన రికార్డును మనమే తిరగరాయాలని పిలుపునిచ్చారు.

జిల్లా అధికార ప్రతినిధి, మండల ఇంచార్జ్ పెద్దిరాజు మాట్లాడుతూ
బిజెపి సభ్యత్వానికి గ్రామీణ ప్రాంతాల్లో అనూహ్యమైన స్పందన ఉందని ఆరు హామీలు 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 9 నెలల్లో హామీలు అమలుచేయలేక ఉత్తుత్తి పేపరు ప్రకటన ఇస్తున్నారని నేటికి రుణమాఫీ సగం మంది రైతులకు కూడా పూర్తి కాలేదని ఆసరా పెన్షన్ల పెంపు,మహిళలకు ప్రతినెల 2500/-,నిరుద్యోగ భృతి,500 కె సిలిండర్,2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయలేక హైడ్రా పేరుతో సమస్యలనుండి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రేస్ కు ఘోర పరాజయం తప్పదని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏ.నరేందర్ శెట్టి, జంగిడి బాలరాజు,సిరియాల శ్రీనివాసులు,పరికి శ్రీనివాసులు,బూత్ కమిటీ అధ్యక్షుడు జంగిడి యాదగిరి,సిరియాల తిరుపతయ్య,
పోతు భరత్,జంగిడి చందు,కుమ్మరి సాయి కుమార్,ఎత్తం సురేష్,మోడల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS