TEJA NEWS

సిసి రోడ్డు మరియు డ్రైనేజీ కి శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

సాక్షిత : వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* అన్నారు..
64వ డివిజన్ మడికొండ గ్రామంలో వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి నుంచి పోచమ్మగుడి వరకు సుమారు రూ. 37.5లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
అనంతరం ఎమ్మెల్యే దశల వారిగా అన్ని వార్డులలో సైడ్ డ్రైన్, సీసీ రోడ్ల పనులను చేస్తున్నామని రోడ్డు నిర్మాణ పనుల్లో స్థానిక కాలనీ వాసులు ప్రభుత్వానికి సంహరించాలని కోరారు.కాలనీలలో ఎటువంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరలో పరిష్కరం చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ పైడిపాల రవిచందర్, మండల అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాసరెడ్డి, స్థానిక డివిజన్ అధ్యక్షుడు కుర్ల మోహన్, మహిళ మండల అధ్యక్షురాలు నీలం రజిని మరియు నాయకులు కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS