TEJA NEWS

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు

భూపాలపల్లి జిల్లా: జనవరి 11
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి విజిలెన్స్ తనిఖీలు గురువారం ముగిశాయి.

మూడు రోజులు పాటు విజిలెన్స్‌ అధికారులు పలుచోట్ల సోదాలు చేపట్టారు. అధికారులు పలు రికార్డులను హైదరాబాద్‌కు తమ వెంట తీసుకెళ్లారు.

మేడిగడ్డ, కన్నెపల్లి పంపు హస్‌కు సంబంధించిన కీలక పత్రాలు సీజ్‌ చేశారు. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్న విజిలెన్స్ ఎస్పీ రమేష్ తెలిపారు.


TEJA NEWS