TEJA NEWS

కృష్ణా జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించిన వి.వి. నాయుడు .

కృష్ణా జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా వి.వి. నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపిఎ‌ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

జిల్లాలో శాంతి భద్రతలు మెరుగుపరిచే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ అడిషనల్ ఎస్పీ కి సూచనలు అందించారు. ముఖ్యంగా క్రమశిక్షణ, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడం, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.

నూతన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి. నాయుడు మాట్లాడుతూ జిల్లా అడిషనల్ ఎస్పీ గా చార్జి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, పోలీస్ సంక్షేమం మరియు సమర్థవంతమైన పోలీసు సేవలను ప్రజలకు అందజేయడంలో తమ వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి‌వి నాయుడు గారు 1991 బ్యాచ్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీసు శాఖలో ప్రవేశించి వివిధ విభాగాలలో, వివిధ హోదాలలో పని చేస్తూ 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది, సాధారణ బదిలీలలో భాగంగా కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా పదవీ బాధ్యతలు చేపట్టినారు.


TEJA NEWS