TEJA NEWS

ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల విషెస్

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు,
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు
తెలిపారు. ‘ నిత్యం దేశ సేవలో తరిస్తూ మోదీ
ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధిస్తున్నా. ఆయన
దార్శనిక నాయకత్వంలో మన దేశం అభివృద్ధి
చెందుతూనే ఉండాలి’ అని బాబు ఆకాంక్షించారు.
‘మన దేశాన్ని పురోగతి, శ్రేయస్సు వైపు నడిపించేలా
ఆయనకు మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం ఉండాలని
కోరుకుంటున్నా’ అని రేవంత్ పేర్కొన్నారు.


TEJA NEWS