TEJA NEWS

చెత్త సేకరణలో కూడా దోపిడీ చేసిన చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.. ప్రత్తిపాటి

దేశంలో చెత్త మీద కూడా పన్ను వేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఈరోజు జరిగిన చర్చలో మాట్లాడుతూ పన్ను చెల్లించకపోతే చెత్త తెచ్చి ఇంటి ముందు వేస్తామని ప్రజలను బెదిరించిన చెత్త ప్రభుత్వం నాటి వైసీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. జగన్ జమానాలో అనేక చోట్ల ఇంటి పన్ను కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా చెత్త పన్ను వసూలు చేశారనీ ప్రత్తిపాటి అన్నారు. చెత్త సేకరణ కోసం వాడిన డబ్బాల కొనుగోలులో వందల కోట్ల దోపిడీకి జరిగిందని, ఈ అవినీతిపై విచారణ చేయాల్సిందిగా మున్సిపల్ శాఖా మంత్రిని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం చెత్త పన్నును రద్దుచేసినందుకు సిఎం చంద్రబాబు కి ప్రత్తిపాటి ధన్యవాదాలు తెలిపారు.


TEJA NEWS