వైఎస్సార్సీపీ పార్టీ 5వ జాబితా పై కొనసాగుతున్న కసరత్తు
సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలో 5వ జాబితా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా నియోజక వర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జిల నియామకం కోసం కసరత్తు చేస్తున్నారు.
ఈ 5వ జాబితా ఈ రోజూ లేకపోతే సోమవారం లోపు విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆశావాహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అమరావతికి క్యూ కడుతున్నారు.
ఆశావాహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం మరియు పార్టీ పెద్దల ఆశీస్సులు కోసం నానా పాట్లు పడుతున్నారు.
నిన్న ద్వారంపూడి చంద్రశేఖర్, మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీకాంత్ రెడ్డి, వేణు గోపాలరావు (దర్శి), కోరుముట్ల శ్రీనివాస రావు తదతరులు అమరావతి వచ్చారు.