TEJA NEWS

శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31 ఒక్క రోజే 6 కోట్ల మద్యం అమ్మకాలు

శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలకు మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయి.డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 6.04 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎచ్చర్ల ఐఎమ్ఎల్ డిపో మేనేజర్ సుబ్బారావు తెలిపారు.

2022 డిసెంబరు 31 రోజు 5.85 కోట్లు మద్యం అమ్మకాలు జరుగగా, ఇప్పుడు 2023 డిసెంబరు 31 రోజు 6.04 కోట్లు అంటే 18.51 లక్షలు అదనంగా మద్యం అమ్ముడు అయినట్లు డిపో మేనేజర్ సుబ్బారావు తెలిపారు.


TEJA NEWS