రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు

Spread the love

3 న గుంటూరు జిల్లా, మంగళగిరి లోని (డి.జి.పి ఆఫీసు పక్కన) , C.K. కన్వేన్షన్ నందు మధ్యాన్నం 2 గం,, లకు రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు

తేది 3/1/24 బుధవారం, జనవరి 3న మంగళగిరిలో

👉🏻 ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.

👉🏻 ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ల ఆధ్వర్యంలో జరగనున్న పంచాయతీరాజ్ సదస్సు.

👉🏻 రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్స్ పాల్గొనవలసిందిగా రాజేంద్రప్రసాద్, లక్ష్మీ ముత్యాలరావుల పిలుపు.

👉🏻 రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల నిధులు, అధికారాలను దొంగిలించి 3 కోట్ల 50 లక్షల గ్రామీణ ప్రజలకు అన్యాయం చేస్తోంది.

👉🏻 అందుకే రాజకీయాలకతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఐక్యమై 16 డిమాండ్ల సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ను ఈ రాష్ట్ర సదస్సులో రూపొందించడం జరుగుతుంది – రాజేంద్రప్రసాద్, లక్ష్మీ ముత్యాలరావు.

👉ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ మరియు సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు గార్ల అధ్యక్షతన జనవరి 3వ తేది బుధవారం తాడేపల్లిలో రాష్ట్రస్థాయి పంచాయతీ రాజ్ సదస్సును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది.

👉ఈ సమావేశానికి రాష్ట్రంలోని 12,918 గ్రామాల నుండి రాజకీయాల కతీతంగా ప్రస్తుత మరియు మాజీ సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, ఎంపీపీలను , జిల్లా పరిషత్ చైర్మన్ లను మరియు పట్టణాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఆహ్వానించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించడమైనది.

👉 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ సదస్సుకు ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి *శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర కమిటీ ఆహ్వానించడం అయినది. వారు అంగీకరించి మీ సదస్సులో పాల్గొని మద్దతును ప్రకటిస్తానని తెలపడం జరిగింది

సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచులు ఎంపీటీసీలు ,జడ్పిటిసిలు, జిల్లా పరిషత్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు,కార్పొరేటర్లు ఎన్నికై దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా నిధులు , అధికారాలు లేక నమ్మి ఓటేసిన గ్రామీణ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలైన త్రాగునీరు శానిటేషన్, లైటింగ్, రోడ్లు , డ్రైనేజీ వ్యవస్థ మొదలగునవి కల్పించలేకపోతున్నారు.

గ్రామ పంచాయతీలకు ,మండల పరిషత్లకు ,జిల్లా పరిషత్లకు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి 14,15 వ ఆర్థిక సంఘం నిధులు 8660 కోట్ల రూపాయలు దారి మళ్లించి సొంత పథకాలకు వాడుకుంది.

అంతేకాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మన గ్రామాలకు మన గ్రామీణ ప్రజలకు సర్పంచ్, ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ల ద్వారా ఖర్చు చేయవలసిన 36 వేల కోట్ల రూపాయలు దారి మళ్లించి సొంత భవనాలకు వాడేసుకోవడం జరిగింది.

✍️ఈ నిధులన్నీ తిరిగి గ్రామపంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్లకు జమచేసి సర్పంచుల, ఎంపీటీసీల, జడ్పిటిసిల తో పనులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వంపై గత 3సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై. వి .బి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు రాజకీయాలకతీతంగా ఉద్యమం చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో

☀️ జనవరి ఒకటో తారీకు నుండి రెండో దశ ఉద్యమాన్ని పంచాయతీరాజ్ సమర శంఖారావం పేరుతో ప్రారంభించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించడం అయినది

✍️కావున జనవరి 3వ తారీకు మంగళగిరి లో జరిగే పంచాయతీరాజ్ రాష్ట్ర సదస్సుకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుండి రాజకీయాలకతీతంగా ప్రస్తుత మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు మరియు అన్ని పట్టణాల నుండి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకోవడంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

బిర్రు ప్రతాప్ రెడ్డి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్

పగడాల రమేష్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం

Print Friendly, PDF & Email

You cannot copy content of this page