TEJA NEWS

మొక్కలు నాటడం మాత్రమే కాదు… వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యతే: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …

126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూం నగర్ (పొలాల బస్తి) లో నిర్వహించిన “స్వచ్ఛదనం – పచ్చదనం” కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్థానికులకు మొక్కలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కలు నాటడం మాత్రమే కాదు… వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యతేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు పాపుల్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు ఇందిరా గౌడ్, పాపిరెడ్డి, బ్రహ్మానంద చారి, మెట్ల శ్రీను, నాగరాజు, హన్మంతు, మంజుల తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS