TEJA NEWS

ఆదివాసి గూడేల అభివృద్ధే నిజమైన ప్రగతి

దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడేల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన ప్రగతి అని మంత్రి సీతక్క(Minister Sitakka) అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొలిటికల్‌ సైన్స్‌ విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ‘‘ఆదివాసీ జీవనోపాధి పద్ధతులు: సాధికారత సాధనలో సమస్యలు, వ్యూహాలు’’ అనే ఆంశంపై నిర్వహిస్తున్న రెండురోజుల అంతర్జాతీయ సదస్సును సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా సమాజం ఒకవైపే అభివృద్ధి చెందుతోందని, గ్రామీణ ప్రాంతం, ముఖ్యంగా ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి అంతగా జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


TEJA NEWS