TEJA NEWS

స్వచ్ఛమైన ప్రాణవాయువు పచ్చదనం పెంపుతోనే సాధ్యమవుతుంది..!
సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ రాక్ గార్డెన్ పార్క్ (సున్నం చెరువు పార్క్) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రాణవాయువు పచ్చదనం పెంపుతోనే సాధ్యమవుతుందని, పర్యావరణ అసమతుల్యతతో కాలుష్య సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో కొత్త కొత్త రోగాలకు దారితీస్తుందని, మానవులకు ఎంతో చేటు చేస్తున్నాయని రేపటి తరానికి పరిశుభ్రమైన గాలి నీరు అందించడమే లక్ష్యంగా చేసుకుని ఒక ఉద్యమంలా చెట్లు నాటాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఓ ప్రసాద్, యుబిడి సిబ్బంది, ఎస్ఎఫ్ఏలు, ఆర్పిలు, పెసరి సంజీవరెడ్డి, బొల్లు శ్రీనివాసరావు, విట్టలయ్య, టీవీఎస్ రాజు, రుణంకి జగన్నాథం, విజయ్ గౌడ్, మాధవచారి, రవీందర్ రెడ్డి, గుత్తికొండ రామకృష్ణ, సత్యనారాయణ, రామారావు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS