TEJA NEWS

బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటాం:డీజీపీ

హైదరాబాద్ :
బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం లో హైదరాబాద్‌లో గట్టి నిఘా పెట్టినట్లు చెప్పారు.

నగరంలోని బంగ్లా దేశీయు లపై నిఘా ఉంచామన్నారు. బంగ్లాదేశ్ నుంచి నగరానికి ఎవరైనా అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు.

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరి కల ప్రకారం నడుచుకుం టామన్నారు. ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ప్రజల భద్రత, రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్య తనిస్తోందని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు.

రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డేటా సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాకథాన్ 2024 కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడు తూ… ప్రస్తుతం డిజిటల్ సైబర్ సెక్యూరిటీ ప్రధానంగా మారిందని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు అయిన ప్పటి నుంచి ఎన్నో కేసుల ను ఛేదించామన్నారు…


TEJA NEWS