TEJA NEWS


శిల్పారామం,గుంటూరు

గడచిన నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీ తెలుగుయువత పోరాట ఫలితంగానే గుంటూరులో శిల్పారామం ప్రారంభానికి నోచుకుందని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ తెలియజేసారు.

4.56 కోట్ల వ్యయంతో
90శాతం పనులు పూర్తిచేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వైకాపా చేతుల్లో పెడితే మిగిలిన పదిశాతం పనులు పూర్తి చేయటానికి ఈ ప్రభుత్వానికి నాలుగున్నరేళ్ల కాలం పట్టింది.

అంటే నాలుగున్నరేళ్ల శిల్పారామాన్ని పాడు పెట్టి ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రారంభం చేయటంలో ఆంతర్యం ప్రజలకు వైకాపా కస్టపడి కట్టించి ఇచ్చినట్లు చూపుతూ నమ్మబలికే ప్రయత్నం తప్ప వేరొకటి కాదు…!

గతంలో గుంటూరు జిల్లా తెలుగుయువత అనేకసార్లు శిల్పారామం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పోరాటం చేసింది అంతే గాక ” భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రలో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా నిర్లక్యం చేసిందో టిడిపి ముఖ్యనేతలతో కూడిన బృందం వచ్చి పరిశీలించిందని గుర్తు చేసారు.

తెలుగుదేశం తెలుగుయువత పోరాట ఫలితంగానే ఈరోజు గుంటూరు ప్రజలకి శిల్పారామం అందుబాటులోకి వచ్చిందని 2023 సంవత్సర రివ్యూలో భాగంగా చూపేందుకే ఈరోజు ఇక్కడకు వచ్చామని తెలియజేసారు.

కార్యక్రమాలో గుంటూరు జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్, తెలుగుయువత టిడిపి నేతలు చెరుకుపల్లి నాగరాజు,కొల్లా నాగుల్, తెలుగుయువత నాయకులు శొంఠినేని అనిల్, శేషాద్రి సాంబశివరావు, పొత్తూరి వెంకటేశ్వరావు, ఉపేంద్ర, కుమార్ బాబు, నవీన్, రాజేష్ తథితరులు పాల్గున్నారు.


TEJA NEWS