నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

Spread the love

బాపట్ల జిల్లా
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.
మద్యం సేవించి వాహనాలను నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఉపేక్షించబోము

జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్

జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలను నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.
జిల్లా పోలీస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ బాపట్ల జిల్లా లో డిసెంబర్ 31 ఆదివారం రాత్రి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యమైన కూడళ్ళలో పికెట్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గత గణాంకాలను పరిశీలిస్తే డిసెంబర్ 31 రాత్రి ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది కనుక విస్తృతంగా డ్రంక్ & డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాలని, మద్యం మత్తులో ఎవరైనా వాహనాలు నడిపినా, బైక్ ల సైలెన్సర్ లు తీసివేసి రణగొణ ధ్వనులను సృష్టిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలు నడిపినా, అతివేగంగా వాహనాలను నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, వాహనాలను సీజ్ చెయ్యాలన్నారు. మైనర్లు వాహనాలను నడిపితే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని వాహన యజమానిని, మైనర్ ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇతరులను ఇబ్బంది కలిగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైన్ షాప్ లు, బార్ లు, రెస్టారెంట్లు, ఇతర దుకాణాలు, హోటళ్ళు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page