TEJA NEWS

స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య

తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతుతున్న అభివృద్ధి పనులను స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్, ఇండోర్ స్టేడియం, మల్టీలెవల్ కార్ పార్కింగ్ పనులను ఇంజినీరింగ్ , స్మార్ట్ సిటీ అధికారులతో కలసి పరిశీలించారు. మూడు ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులు కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇచ్చిన గడువు లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలని అన్నారు.

సిటీ ఆపరేషన్ సెంటర్ పనుల్లో నాణ్యతను, నిర్మాణ పనుల ప్లాన్ ను పరిశీలించారు. ప్లాన్ ప్రకారం త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. అలాగే ఇండోర్ స్టేడియం ను పరిశీలించారు. షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, జిమ్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులను పరిశీలించారు. ప్రేక్షకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సీటింగ్ జోన్ ను పరిశీలించి, పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ మల్టి లెవల్ కార్ పార్కింగ్ భవనం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, డి.ఈ.లు రాజు, మధుబాబు, ఏ ఈ కాం ప్రతినిధి బాలాజి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.


TEJA NEWS