TEJA NEWS

కంగనా వ్యాఖ్యలు.. మండిపడిన వీహెచ్..

పీఎస్‌లో కేసు నమోదు

గాంధీ భవన్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీపై ఎంపీ, బీజేపీ నేత కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కంగనాపై అంబర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా.. రాహుల్ చెత్తగా మాట్లాడతారని, డ్రగ్స్ తీసుకుంటారని కంగనా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన వీహెచ్… పాపులారిటీ కావడం కోసమే కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమె ఏదున్నా పార్లమెంట్‌లో మాట్లాడాలని సూచించారు. రాహుల్‌కి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని.. రాహుల్‌తోపాటు బడుగు, బలహీన వర్గాల ప్రజలందరినీ ఆమె అవమానించిందని మండిపడ్డారు.

హైడ్రా గుడ్ వర్క్..

హైదరాబాద్ మహానగరంలో చెరువులు ఇతర జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ భేష్ అని వీహెచ్ పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చక్కగా పని చేస్తున్నారని కితబిచ్చారు. అయితే ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చాల్సి వస్తే.. వారికి వేరే చోట డబల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని కోరారు. సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యుల అక్రమాలు ఉన్నాయని తేలినా.. కూల్చేయాలని చెప్పడం మంచి విషయమని వీహెచ్ అన్నారు.


TEJA NEWS