TEJA NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

కమలాపూర్ సాక్షిత

కమలాపూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో 1999-2000సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల 25 సంవత్సరాల తర్వాత కలుసుకొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్య నేర్పిన గురువులను పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం గురువులను శాలువాలతో సన్మానించారు. పూర్వ విద్యార్థులు మిత్రులతో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వాళ్ళు చదువుకున్న రోజులలో ఆటలతో పాటలతో ఆనందంగా చదువుకున్న రోజులను ఇప్పటికీ మేము మర్చిపోలేము అని మిత్రులందరు స్కూలు వాతావరణాన్ని గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు ఒకరిఒకరిని పరిచయం చేసుకుంటూ ప్రస్తుత కాలంలో వారు చేసే పనిని వాళ్ళు ఉండే గ్రామాలను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చదువు నేర్పిన గురువులు మాట్లాడుతూ మీరు చదువుకున్న రోజులలో చదువులోనైనా ఆటపాటలోనైనా ఒక క్రమశిక్షణతో ఉండేవారని విద్యార్థులను ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుఖదేవ్ ఎడ్వర్డ్ మూల నారాయణ. పూర్వ విద్యార్థులు స్వప్న ప్రియా మాధవి శ్వేత పరిమళ కవిత సరిత అరుణ కిన్నర వేణు శ్రీకాంత్ రామకృష్ణ విజయ్ పుల్ల సురేందర్ మాట్లా మురళి పుల్లా మహేష్ తదితర విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS