TEJA NEWS

గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమం నిర్వహించిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్

ఫిర్యాదు దారుల నుండి వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తాము చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వున్న కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ఇతర అధికారులతో కలిసి”ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమం నిర్వహించారు.

గుంటూరు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదిదారులు వారి వారి సమస్యలను జిల్లా ఎస్పీ కి స్వయంగా తెలియ పరిచారు వారి సమస్యలను విన్న జిల్లా ఎస్పీ వారి సమస్యలను అర్జీలను పరిశీలించి, చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వున్న కాన్ఫరెన్స్ హాలులో”ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.

ప్రజల ఫిర్యాదులలో చీటింగ్ కేసులు, అధిక కట్నం కోసం అత్త ఇంటి వారి వేధింపులు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు సంబంధించిన ఫిర్యాదులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి వచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదులోని విషయాలను కూలంకశంగా అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలియజేసి వారి ఫిర్యాదులను చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చిన ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకూడదని పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ శ్రీ జి వి రమణమూర్తి గారు, ట్రాఫిక్ డి ఎస్ పి వి వి నాయుడు , క్రైమ్ డి ఎస్ పి శివాజీ రాజు , యస్ టి యస్ సి డి ఎస్ పి శ్రీ మల్లిఖార్జున రావు స్పెషల్ బ్రాంచ్ సి ఐ వెంకట రావు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

TEJA NEWS