గురు. జూలై 18th, 2024

పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ

TEJA NEWS

పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు పై చర్యలు తీసుకోవాలని…

……….
పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెద ముషిడి వాడ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఎదురుగా కిలో మీటర్ దూరంలో ఉన్న చెరువులోని సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్ చేశారు. దీంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో ఆ విష రసాయన వాయువులు పీల్చలేక స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు రాంకీ యాజమాన్యం చెక్ పోస్ట్ లు సక్రమమైన చెకింగ్ లేకుండా వాహనాల పంపించడం వలన కొంతమంది తుక్కు దుకాణ యాజమాన్యాలు ఎక్కడపడితే అక్కడ వ్యర్ధాలు డ్రంపింగ్ చేస్తున్నారు. దీనివలన పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఫార్మా వ్యర్ధా రసాయనాలను డంపింగ్ చేస్తుండడంతో వాయు, భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయి ప్రజల ప్రాణాలతో రాంకీ యాజమాన్యం చెలగాటమాడుతుంది. డంపింగ్ చేసిన డ్రమ్ముల మీద పరవాడ ,అచ్యుతాపురం ఫార్మా కంపెనీలకు చెందిన లేబుల్స్ కనిపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గతంలో కూడా వాడ చిపురుపల్లిలో భారీ ఫార్మా రసాయనిక డ్రమ్ములను గుర్తించారు. ఫార్మా కంపెనీల నుండి ఫార్మా రసాయనిక వ్యర్ధాలు నిబంధనల ప్రకారం బయటికి రావడానికి అనుమతులు లేవు ఫార్మా వ్యర్ధాలను చెరువుల్లో కలిపిన వ్యక్తులు పైన రాంకీ యాజమాన్యం పైన, ఫార్మా పరిశ్రమ యాజమాన్యం పైన సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గని శెట్టి డిమాండ్ చేశారు పరవాడ భరణికం మొల్లేడు గడ్డలో రసానికి వ్యర్థ జలాలు వదలడం మరోవైపు ఉప్పుటేరులో చాపల మృత్యువాత పడ్డాం వంటి చర్యలు పై రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యం పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జిల్లాఉన్నత అధికారులు,పోలీస్, రెవెన్యూ మత్స్య శాఖ, ఇరిగేషన్ శాఖల అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్ చేశారు

పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ
Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page