అభిజిత్ అక్రమ లే ఆఫ్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉపాధి కల్పించాలని.సిఐటియు డిమాండ్
అచ్చుతాపురంలో నాలుగో రోజు వర్షం లోను కార్మికులు ఆబిజిత్ పరిశ్రమ వద్ద ఆందోళన నిర్వహించారు పరిశ్రమ వద్దనుండి ర్యాలీగా అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసిల్దారు కి వినతిపత్రం అందజేయడం జరిగింది .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ .రాము, మండల కన్వీనర్ కోండ్రపు .సోమనాయుడు మాట్లాడుతూ అభిజిత్ యాజమాన్యం అక్రమ లే ఆఫ్ ప్రకటించడానికి తీవ్రంగా ఖండించారు
కార్మికులతో సంప్రదించకుండా విధులకు హాజరైన కార్మికులను పరిశ్రమలోకి రానివ్వకుండా అక్రమ నోటీసు అంటించి గేటు బయట నిలుపుదల చేయడం చట్ట విరుద్ధం 15 రోజులు జీతం ఇస్తాం అని చట్ట వ్యతిరేకంగా చెబుతున్నారు నాలుగు రోజులుగా పరిశ్రమ ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహిస్తూ డెవలప్మెంట్ కమిషనర్ లేబర్ ,తహసిల్దార్ గారికి తెలియజేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం వెంటనే ప్రభుత్వం కలగజేసుకొని 1000 మంది కార్మికులకు అబిజిత్ పరిశ్రమలో ఉపాధి కల్పించాలాని యాజమాన్యం వెంటనే కార్మికులతో చర్చించి సమస్య పరిష్కారం చేయాలని లేదంటే కార్మికులంతా ఐక్యమై పెద్ద ఎత్తున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అభిజిత్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు