TEJA NEWS

అడ్వాన్స్ ఢ్ ట్రైనింగ్ సెంటర్ లో ఆధునిక వృత్తి విద్యా కోర్సులు – స్పాట్ అడ్మిషన్లు
10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి – అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్

వనపర్తి :

ప్రభుత్వ ఐ.టి. ఐ కళాశాలలో ప్రస్తుతం బాగా డైమండ్ ఉన్న వృత్తి విద్యా కోర్సుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్లు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఐ.టి. ఐ కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) నెలకొల్పి వాటిలో ప్రస్తుతం బాగా డిమాండు ఉన్న కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ ఆధునిక వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గాను రాష్ట్ర లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యవంతమైన వృత్తి విద్యతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి నూతనంగా (6) కోర్సులను ప్రవేశ పెట్టిందన్నారు. వనపర్తి జిల్లాలో 1. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ (40 సీట్లు), 2. మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్(24 సీట్లు), 3. బేసిక్ డిజైనర్ మరియు వర్చువల్ వెరిఫైయర్ మెకానికల్ (24 సీట్లు) 4. ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ (20 సీట్లు) 5. అడ్వాన్స్డ్ సిఎంసి మిషన్ టెక్నీషియన్ (24 సీట్లు) 6. ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్(40 సీట్లు) ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులని, కోర్సును బట్టి ఒకటి లేదా రెండు సంవత్సరాల కోర్సులు ఉన్నట్లు తెలిపారు. కోర్సు పూర్తి అయిన వెంటనే ఉపాధి, ఉద్యోగ కల్పన కు ఈ ఆధునిక కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని అక్టోబర్ 30 లోగా భర్తీ చేయాలని గడువు పొడిగించారు.


వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ ప్రస్తుతం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ భవనం నిర్మాణం పూర్తి కానందున ప్రస్తుతానికి ఉన్న ఐ.టి.ఐ కళాశాలలో ఈ కొత్త కోర్సులను చదివించడం జరుగుతుందన్నారు. భవనం నిర్మాణం పూర్తి అయ్యాక అడ్వాన్స్ ట్రెయింగ్ సెంటర్ కు మార్చడం జరుగుతుందని తెలిపారు. కొత్త కోర్సుల పై విద్యార్థులకు విస్తృత అవగాహన, ప్రచారం కల్పించి వచ్చిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐ.టి. ఐ కళాశాల ప్రిన్సిపల్ కె. రమేష్ బాబు, ట్రైనింగ్ ఆఫీసర్ మొహమ్మద్ ఏహెతేస్ముల్ హక్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS