TEJA NEWS

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్ 2024 తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత దాదాపు 19వేల సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి.

ఏపీలో భారీగా ఇంజనీరింగ్ సీట్ల మిగులు…

అడ్మిషన్స్ :

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్ 2024 తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది. తుది విడత కౌన్సిలింగ్‌లో 17,575మంది సీట్లు దక్కించుకున్నారు. కౌన్సిలింగ్ పూర్తై తర్వాత తర్వాత దాదాపు 19వేల సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. మొత్తం అన్ని కాలేజీల్లో కలిపి 18,951 ఖాళీలు ఉండిపోయాయి. వీటిని స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా మంగళ వారం తుది విడత సీట్ల కేటాయింపును పూర్తి చేశారు. తుది విడత సీట్ల భర్తీ తర్వాత 18,951 సీట్లు భర్తీ కాకుండా మిగిలి పోయినట్టు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు.

అడ్మిషన్లు పొందిన విధ్యార్ధులు ఆగస్టు 3 లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయడం తో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీలో జులై 19 నుండి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం అయ్యాయి.

ఏపీలో కన్వీనర్ కోటా కింద 24 విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలల్లో 6981 సీట్లు ఉండగా వాటిలో 6153 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. యూనివర్శిటీ కాలేజీల్లో 828 సీట్లు మిగిలిపోయాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 214 ప్రవేటు కళాశాలల్లో 1,24,324 సీట్లు ఉండగా, 1,06, 324 భర్తీ అయ్యాయని 18వేల సీట్లు మిగిలిపోయినట్టు సాంకేతిక విద్యా శాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన 9 ప్రవేటు విశ్వవిద్యాలయాల్లో 7950 సీట్లు ఉండగా, 7826 సీట్లు భర్తీ చేసామని తెలిపారు. వీటిలో 126 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శిటీల్లో అందుబాటు లో ఉన్న మొత్తం సీట్లలో 25శాతం ప్రభుత్వ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. మొత్తం 247 కళాశాలల్లో 1,39,254 సీట్లు ఉండగా, 1,20,303 సీట్లు భర్తీ అయ్యాయని, 18, 951 సీట్లు ఉన్నాయి


TEJA NEWS