TEJA NEWS

పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.సినర్జీన్ ఫార్మాలో లీకైన రియాక్టర్.నలుగురికి తీవ్ర గాయాలు.ఒకరు పరిస్థితి విషమం.ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

అనకాపల్లి జిల్లా పరవాడ అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం మరవకముందే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లోని సినర్జీన్ యాక్టివ్ ఇన్. గ్రేడియట్స్ ఫార్మ కంపెనీలో రియాక్టర్ లీకైన ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కార్మికుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపై ఆందోళన వ్యక్తం చేశారు. సెనర్జన్ ఘటనపై
జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించేందకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని ఆదేశించారు. ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ప్రైవేటు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గాయపడిన నలుగురు కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఘటన, బాధితులకు అందుతున్న సాయంపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం పంపాలని అధికారులను సిఎం ఆదేశించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS