TEJA NEWS

నవ క్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు – బీసిఐ క్షేత్ర సహాయకులు – కంచం అనిల్

కమలాపూర్

గులాబీ రంగు పురుగు నివారణకు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది లింగాకార్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ బీసీఐ క్షేత్ర సహాయకులు కంచం అనిల్ తెలిపారు. కమలాపూర్ మండల పరిధిలోని నేరెళ్ల గ్రామంలో నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో పత్తి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కంచం అనిల్ మాట్లాడుతూ రైతులు పత్తిపంటలో వచ్చే తెల్లదోమ, పచ్చదోమ నివారణకు విషపూరితమైన క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారని, వీటి ద్వారా పర్యావరణం , నీరు, భూమి, నేల కాలుష్యమవు తున్నాయని ఆయన అన్నారు. రసాయనిక ఎరువులు వినియోగించిన తర్వాత మందు డబ్బాలను పూడ్చివేయడం లేదా కాల్చివేయాలని సూచించారు. రసం పీల్చు పురుగుల నివారణకు పంటచేను లో పసుపురంగు జిగురు అట్టలు ఎకరాకు 10 నుంచి 12 ఏర్పాటు చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలని, పాటాష్ ఎరువులు వినియోగిం చాలని, పూత, కాత రాలిపోకుండ బోరాన్ లాంటి సూక్ష్మదాతు పోషకాలు పిచికారీ చేయాలని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు ఈరబోయిన సతీష్ ,అల్లటి రవీందర్, గోల్కొండ సారంగం, కొండం ఐలయ్య మొగిలి, శ్రీకాంత్, రమేష్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS