TEJA NEWS

సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రక్స్ పై అవగాహన సదస్సు.
కళాశాల నుండి బదలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం.
ముఖ్య అతిథిగా హాజరైన డిఐఈఓ బాను నాయక్.

సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పెరుమళ్ల యాదయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు మారక ద్రవ్యాల (డ్రక్స్) వాడకం, పై కలిగే నష్టాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా ఎన్నో ఏండ్లుగా కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి బదిలీ పై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానకార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డిఐఈఓ బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డ్రక్స్ మహమ్మారి కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే కాకుండా మొత్తం దేశాన్నే అల్లకల్లోలం చేస్తుందనీ 14 సం”ల నుండి 30 సం”ల యువకులు అధిక మొత్తంలో డ్రక్స్ భారిన పడుతున్నారని పేర్కొన్నారు. కొకైన్, హెరైన్ అనే పేర్లను కలిగి డ్రక్స్ ఉంటున్నాయని వాటితో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని వీటి భారిన పడినవారు జీవితం లో ఏమి సాధించలేరని విద్యార్థులను హెచ్చరించారు. డైరెక్ట్ డ్రక్స్ తీసుకోవడానికి ఇష్టపడని వ్యక్తులకు చాక్లెట్,బిస్కెట్లల్లో పెట్టి విక్రయిస్తున్నారని తెలిపారు. జీవితం లో ఎవరు ఎలా తయారు కావాలన్న ఇంటర్మీడియట్ విద్య చాలా ముఖ్యమైనదని గుర్తుచేశారు. కళాశాలలో విద్యను అభ్యసించి క్రమశిక్షణతో ఉండాలని, ఈ వయస్సు లో అన్ని అద్భుతాలుగా కనిపిస్తాయని ప్రలోభాలను నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని క్రమ శిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశించారు . అప్పటికప్పుడు మత్తును కలిగిస్తూ ఎన్నో అనర్థాలకు దారి తీసే మారక ద్రవ్యాలకు అలవాటు పడవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానోపాధ్యాయులు పెరుమాళ్ల యాదయ్య, ప్రసాద్, సైదులు, గురయ్య, వాసు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS