పాఠశాల విద్యార్థి, విద్యార్థినులకు సైబర్ నేరాలుపై అవగాహన….సిఐ.బాల సూర్యరావు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో పాఠశాల విద్యార్థి, విద్యార్థినులకు బుధవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పరవాడ సీఐ బాల సూర్యరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి, విద్యార్థినులకు సబ్ స్టేషన్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ బాల సూర్యరావు మాట్లాడుతూ చిన్నతనం నుండే రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ర్యాగింగ్ మరియు సైబర్ క్రైమ్ గురించి కూడా తెలుసుకోవాలని అన్నారు.
ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, కాబట్టి విద్యార్థి, విద్యార్థినులు సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక యాప్ లను డౌన్లోడ్ చేసుకొని వాడడం మానుకోవాలన్నారు. రోడ్డు పై మరియు బస్సు ఎక్కేటప్పుడు, బస్సుదిగే సమయంలో జాగ్రత్త వహించాలని సూచనలు ఇచ్చారు. అదేవిధంగా పాఠశాల సెలవు దినాల్లో ఇంటి వద్ద పెద్దలకు సంబంధించిన ద్విచక్రవాహనాలను వారికి తెలియకుండా తీసుకువెళ్లి నడపరాదని, ఆ విధంగా మైనర్ డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.