TEJA NEWS

సైబర్, సోషల్ మీడియా నేరాలపై అవగాహన

సాక్షిత రాజమహేంద్రవరం, :
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్, సోషల్ మీడియా నేరాలపై విద్యార్థులకు జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం సైబర్ క్రైమ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాజమహేంద్రవరం శశి కళాశాలలో 280 మంది విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ వారు అవగాహన కల్పించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో వివిధ రకాలైన సైబర్ నేరాల గురించి, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహనపరిచారు. ఒకవేళ సైబర్ నేరాల బారిన పడినట్లు అయితే వెంటనే 1930 కు ఫోన్ చేయడం గాని, Cybercrime.gov.in వెబ్ సైట్ లో గాని, సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా జిల్లా పోలీస్ కార్యాలయంలో గాని సంప్రదించాలని అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమం ఉమామహేశ్వరరావు( ఇన్స్పెక్టర్ సోషల్ మీడియా అండ్ సైబర్ క్రైమ్)జిల్లా సైబర్ క్రైమ్ టీం ఆధ్వర్యంలో అయ్యప్ప రెడ్డి( సబ్ ఇన్స్పెక్టర్), సురేష్( కానిస్టేబుల్),దుర్గా ప్రసాద్( కానిస్టేబుల్), మహేష్( కానిస్టేబుల్),అబ్దుల్ షౌకత్( కానిస్టేబుల్) వారు అవగాహన కల్పించినారు.


TEJA NEWS