TEJA NEWS

డెంగ్యూ మరియు మలేరియా వ్యాధులపై అవగాహన కార్యక్రమం


శంకరపల్లి : శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామం లో స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం లో భాగంగా మూడవ రోజు మలేరియా , డెంగ్యు మరియు వివిద వ్యాధులపై గ్రామస్తులకి అవగాహన కార్యక్రమం పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య నిర్వహించారు. అనంతరం క్రీడా ప్రాంగణ ఆవరణలో విజయవంతంగా 100 మొక్కలని నాటారు. ఈ కార్యక్రమం లో ఎపిఓ నాగభూషణం,పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య ,పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.


TEJA NEWS