కెమిక ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో గాయపడ్డ కార్మికునికి మెరుగైన వైద్యం అందించాలిని డిమాండ్ చేస్తున్న – సిఐటియు
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని కెమిక డ్రగ్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు గాయపడిన సంఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. భవనం పైకప్పు నిర్మాణ పనుల్లో భాగంగా సేఫ్టీ బెల్ట్ మారుస్తుండగా అదుపు తప్పి పశ్చిమ బెంగాల్ కు చెందిన హాయిల్ షేక్(21) అనే కార్మికుడు కుప్పకూలి పోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని విశాఖలోని ఓ ఆసుపత్రికి తరలించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కంపెనీ యాజమాన్యం బయటకు పొక్కనీయలేదు. తోటి కార్మికుల సమాచారంతో ఆదివారం సాయంత్రం బయటకు తెలిసింది. విషయం తెలుసుకున్న ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కంపెనీ ఎదుట విలేకరులతో మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పటికీ కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. గాయపడ్డ కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, పూర్తిగా కోలుకునే వరకు జీతం చెల్లించాలని గనిశెట్టి డిమాండ్ చేశారు.
కెమిక ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో గాయపడ్డ కార్మికునికి మెరుగైన వైద్యం
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…