TEJA NEWS

సిద్దిపేటలో భద్రాచల ముత్యాల తలంబ్రాల పంపిణి

రామకోటి రామరాజు సేవలకు గాను ఘన సన్మానo

సాక్షిత సిద్దిపేట జిల్లా

గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ సేవలను గుర్తించి భద్రాచల దేవస్థానం 100కిలోల ముత్యాల తలంబ్రాలను అందజేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది భక్తులకు పంపిణి చేస్తున్నారు. సిద్దిపేట లోని మార్కండేయ స్వామి దేవాలయంలో తలంబ్రాల విశిష్టత తెలియజేసి భక్తులకు అందజేశారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు .

ఈ సందర్బంగా మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కల్యాణాని సిద్దిపేట చుట్టూ ప్రక్కల గ్రామాలనుండి వేలాది భక్తులు గోటి తలంబ్రాలలో వడ్లను ఓలిచి అందించారు. అందుకే కల్యాణ అనంతరం ముత్యాల తలంబ్రాలు భక్తులకు అందించామని తెలిపారు.

భక్తులు మాట్లాడుతూ మా గ్రామానికి ముత్యాల తలంబ్రాలు తీసుకురావడం రామకోటి రామరాజు రామసేవ అమోగమని భక్తబృందం వాళ్ళు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శ్రీరామభక్త సేవా బృందం సభ్యులు బచ్చు లక్ష్మణ్, బైరి మురళి, అయిత శ్రీకాంత్, కాసోజు శ్రీనివాస్, కరోళ్ల చిరంజీవి, తంగళ్లపల్లి నరేష్, అర్చకులు మలిపెద్ది నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS