TEJA NEWS

బీసీల ఆరాధ్యదైవం, బీసీ పితామహుడు, బిపి మండల్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన జగిత్యాల బిసి సంక్షేమ సంఘం. అనంతరం బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీపీ మండల్ గారు సాధించిన ఘనతల గురించి బిందేశ్వరి ప్రసాద్ మండల్ (1918–1982) భారతదేశ పార్లమెంటు సభ్యుడు, సంఘ సంస్కర్త. అతను రెండవ వెనుకబడిన తరగతుల కమీషన్ (మండల్ కమీషన్ గా సుపరిచితం) కు చైర్మన్ గా వ్యవహరించాడు. అతను ఉత్తర బీహార్ లోని సహర్సాలో అత్యంత ధనికులైన యాదవ్ జమీందారీ (భూస్వాములు) కుటుంబంలో జన్మించాడు. కమీషన్ భారతదేశంలోని ప్రజలలో ఒక భాగాన్ని “అదర్ బేక్ వర్డ్ క్లాసెస్”(OBCs) (ఇతర వెనుకబడిన కులాలు) గా నివేదిక ప్రకారం నివేదించింది. భారతీయ రాజకీయాల్లో తక్కువగా ఉన్న, బలహీన వర్గాల కోసం పాలసీపై తీవ్రమైన చర్చ ప్రారంభమైంది..పి. మండల్ ( బిందేశ్వరి ప్రసాద్ మండల్ ) బీహార్ లోని బనారస్ లోని ఒక యాదవ్ కుటుంబంలో 1918 ఆగస్టు 25న జన్మించాడు.[3].[4] మాధేపురా జిల్లాలోని మోరో గ్రామంలో పెరిగాడు. మండేపురంలో మండల్ తన ప్రాథమిక విద్యని , దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యని పూర్తి చేసాడు. 1930 లలో పాట్నా కాలేజీలో ఇంటర్మీడియేట్ పూర్తి చేసిండు. ఆ తరువాత పై చదువులకై అతను ప్రెసిడెన్సీ కళాశాల కలకత్తాలో చేరిండు. దురదృష్టవశాత్తు, ఇంట్లో కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా, అతను తన చదువుని విడిచిపెట్టవలసి వచ్చింది.

మండల్ తన 23 వయేటా జిల్లా కౌన్సిల్ కి ఎన్నికయ్యాడు. 1945-51 మధ్య కాలములో మాధేపుర డివిజన్ లో జీతం తీసుకోకుండానే జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ గా పని చేసాడు. అతని రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్ తో మొదలైంది. 1952 లో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అధికార పక్షములో ఉండి బీహార్ లోని బలహీనవర్గ కుర్మీలపై అగ్రవర్ణ రాజుపుత్రులు దాడి చేయడాన్ని నిరసించాడు. 1965 లో తన నియోజకవర్గంలో భాగంగా ఉన్న గ్రామమైన పామాలో మైనారిటీలు, దళితులపై పోలీసులు చేస్తున్న అత్యాచారాలపై మాట్లాడాలని కోరుకున్నప్పుడు అధికార పక్షములో ఉండి ఈ అంశంపై మాట్లాడకూడదని ముఖ్యమంత్రి ఆదేశిస్తే తన మనస్సాక్షిని చంపుకోలేక తను నమ్మిన విలువల కోసం ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి సిద్దమై సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్.ఎస్.పి) లో చేరాడు. ఎస్.ఎస్.పి రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ గా నియమించబడ్డాడు.

1967 లో జరిగిన ఎన్నికలలో ఎస్.ఎస్.పి అభ్యర్ధుల ఎంపికపై ఆయన చేసిన కృషి, ఆయన ప్రచారం వల్ల 1962 లో కేవలం 7 సీట్లు కల ఆ పార్టీకి 1967 లో 69 సీట్లు వచ్చాయి. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెస్ యేతర ప్రభుత్వం ఏర్పడింది. అతను పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ మంత్రివర్గంలో చేర్చారు. ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసాడు. కానీ పార్టీలో, ప్రభుత్వములో కొన్ని విబేధాలు రావడముతో కాంగ్రెస్ పార్టీ బయటి నుండి మద్దతు ఇవ్వడంతో 1968 ఫిబ్రవరి 1 న అతను బీహార్ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించాడు.[5] కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటూనే రాజీ పడకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అవినీతిపై అయ్యర్ కమీషన్ వేసి విచారణ చేయించాడు. ఆ కమీషన్ నివేదికను బయలుపరచకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధి స్వయంగా ఒత్తిడి తీసుకవచ్చింది. ప్రధానితో అతను మాట్లాడడానికి నిరాకరించడముతో ప్రభుత్వముపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గడంతో 30 రోజులకే మండల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అతను తరచూ తన మంత్రులకు, “ఓట్లను సంపాదించడానికి కులపరమైన విజ్ఞప్తి సహించవచ్చు కానీ ప్రభుత్వాల నిర్ణయాలల్లో ఏ కులతత్వాన్ని సహించవద్దు” అని చెప్పే మండల్ తన ప్రభుత్వములో పరిపాలనలో ఎక్కడ కులతత్వాన్ని ప్రదర్శించకుండా పాలించాడు.

1967 మార్చి 5న అతను సోషిత్ దళ్ (అణగారిన ప్రజల పార్టీ ) ని స్థాపించాడు. 1967 నుండి 1970 వరకు లోక్‌సభ సభ్యునిగా ఉన్నాడు. 1972 లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు. 1972 లో అప్పటి బీహార్ ముఖ్య మంత్రి పాండే మిథిలా యూనివర్సిటీ పేరుతో అందులో కింది ఉద్యోగి నుండి వైస్ ఛాన్సలర్ వరకు ఒకే కులం వారితో నింపాలనే ప్రయత్నాలని వ్యతిరేకించాడు. ఆ తర్వాత 1974 లో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి జయప్రకాష్ నారాయణ నేతృత్వములో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమములో పాల్గొన్నాడు. 1977 లో జనతా పార్టీ తరపున లోక్ సభకి ఎన్నికై 1979 వరకు కొనసాగాడు. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పాటైన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీని డిబార్ చేయాలని అధికార పార్టీ సభ్యులు తెచ్చిన తీర్మానాన్ని మండల్ వ్యతిరేకించాడు. మండల్ తన రాజకీయ జీవితంలో సోషలిస్ట్ రాజకీయాల ఆలోచనపరుడిగా పని చేసాడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జాజాల రమేష్, బి.సి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మారిశెట్టి సూర్యప్రకాష్, బి.సి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బిసి సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షుడు రాపర్తి రవి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ముద్దం గంగారెడ్డి, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS