TEJA NEWS

సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను రక్షించాలి : బూర వెంకటేశ్వర్లు

డెంగు, మలేరియా వంటి అంటు వ్యాధులు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్న పట్టణ ప్రజలను కాపాడాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంటువ్యాధుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఘోర వైఫల్యం చెందిందని ఆరోపించారు. సిపిఐ పార్టీ ఆఫీస్ కామ్రేడ్ ధర్మాభిక్షం భవన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విష జ్వరాలు, అంటూ వ్యాధుల భారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో వైద్య, ఆరోగ్యశాఖ మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. అంటూ వ్యాధులు, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా అన్ని వార్డులలో పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పి.హెచ్.సి సెంటర్లలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అన్ని వార్డులలో వైద్య, ఆరోగ్య సిబ్బందిని పంపించి సంచారా వైద్య బృందాల ద్వారా పట్టణ ప్రజలందరికీ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ కార్యవర్గ సభ్యులు, నిమ్మల ప్రభాకర్, పెండ్ర కృష్ణ, ఎస్.కె పాషా, నాయకులు గాలి రామకృష్ణ పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS