TEJA NEWS

మచ్చలేని నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు..
…………………………………………………………………………………
సాక్షిత : కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ పై పత్రికా విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గాజులరామారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..

మా సీఎం రేవంత్ రెడ్డి పైన, మా నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పైన మరోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే గల్లీలో కొట్టుడు ఖాయం.. మేం కాదు ప్రజలే కొడతారు.

పోలీసులు కొడితే అమ్మా, అయ్యా అని బయటికి వచ్చినోడు కూడా ఎగిరెగిరి పడుతుండు.. 35 ఎకరాల ఫోర్జరి కేసులో జైలుకు వెళ్లి వచ్చినా ఒక మాజీ కార్పొరేటర్ కి ఇంకా సిగ్గు రాలేదు.

ఫోర్జరీలు చేసి జైలుకు వెళ్లిన నాయకులు, రాజీవ్ గృహకల్ప ఎక్స్టెన్షన్ నిందితులు సైతం కూన శ్రీశైలం గౌడ్ పై మాట్లాడటం సిగ్గుచేటు.

బీఆర్ఎస్ కార్పొరేటర్లు లుచ్చాగాళ్లు.. ఒకడేమో బాలానగర్ లాడ్జిలో దొరికిండు.. ఇంకొకడు ఫైనాన్సు ఆఫీసులో డబ్బులు వాడుకొని సామాన్యుల ముంచి కార్పొరేటర్ అయిండు.

ఇప్పుడున్న కార్పొరేటర్లంతా శ్రీశైలం గౌడ్ పెట్టిన రాజకీయ భిక్షతో బతికి, ఇవాళ ఆయననే విమర్శిస్తారా?

కుత్బుల్లాపూర్ లో నాళాలు, రేషన్ షాపులు, ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కూన శ్రీశైలం గౌడ్ గారిదే..

కాంగ్రెస్ పార్టీ వల్ల బతికిన ఫ్యామిలీ వివేకానంద ది

ప్రజలను పీడిస్తూ లుచ్చా పనులు చేస్తున్న కార్పొరేటర్లు.. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాసేవకు ముందుండాలని హెచ్చరిస్తున్నాం.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేకానందకు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ రాజుకు టికెట్ వస్తుందని చెప్పిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యే నుండి ప్యాకేజీలు రాగానే బలవంతంగా పనిచేశారు.

ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పనిచేసింది మీరు కాదా.. ఇప్పుడు గెలవగానే మా ఎమ్మెల్యే అంటున్నారు.

హైడ్రాకు భయపడేది కేవలం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు మాత్రమే.

గ్రాడ్యుయేట్ చేస్తేనే మీ ఎమ్మెల్యే విద్యావంతుడా.. ఏమైనా డబల్ పీజీలు, పీ.హెచ్.డి లు చేసిండా.. అంతకంటే విద్యావంతులు మా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు.

మచ్చలేని నాయకుడు కూన శ్రీశైలం గౌడ్.. ఆయనపై ఇంకోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏంటో చూపిస్తాం బిడ్డా.. ఖబడ్ధార్ అంటూ హెచ్చరించారు.

ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు బొడ్డు వెంకటేశ్వరరావు, పాలకృష్ణ, టిపిసిసి ప్రధాన కార్యదర్శి పున్నారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుంజ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ బొబ్బా రంగారావు, డిసిసి ఉపాధ్యక్షులు శ్రవణ్, బండి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓరుగంటి కృష్ణా గౌడ్, బుచ్చిరెడ్డి, కూన రఘు గౌడ్, మోతే శ్రీనివాస్ యాదవ్, జయరాం, రషీద్, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, బేకు శ్రీనివాస్, పండరి, శివ కుమార్, రాధా కృష్ణ, రహ్మతుల్లా, నాయకులు బాలప్ప, చాంద్ పాషా, రషీద్ బేగ్, కృష్ణ యాదవ్, లాల్ మహ్మద్, మధు సూధన్, తదితర నాయకులు ఉన్నారు.


TEJA NEWS