TEJA NEWS

మైనర్లు వాహనం నడిపితే వారి ప్రాణాలకి ప్రమాదం: చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం

శంకర్‌పల్లి: మైనర్లు వాహనాలు నడపరాదని చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి ఫతేపూర్ బ్రిడ్జి దగ్గర మైనర్లకు, డ్రైవర్లకు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండని మైనర్లు నడపరాదని, 18 సంవత్సరాలు నిండకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. డ్రైవర్లు అందరూ కచ్చితంగా యూనిఫామ్ ధరించాలన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. సెల్ ఫోన్లు మాట్లాడుతూ రోడ్లు దాటొద్దని తెలిపారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపరాదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేనియెడల కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ అశోక్ పాల్గొన్నారు


TEJA NEWS